Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. టీడీపీ కండువా కప్పుకున్న ఆళ్ల నాని

సెల్వి
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (12:05 IST)
Alla Nani
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ల నాని అధికారికంగా పార్టీలో చేరారు. ఆళ్ల నాని ఉండవల్లికి వెళ్లి, అధికారికంగా పార్టీలో చేరడానికి ముందు చంద్రబాబు నాయుడును కలిశారు.
 
ఆళ్ల నానిని చంద్రబాబు నాయుడు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇంకా పార్టీ కండువా కప్పి టీడీపీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సుజయ్ కృష్ణ రంగారావు సహా పలువురు కీలక నాయకులు హాజరయ్యారు.
 
ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత నుంచి వైసీపీకి దూరంగా ఉన్న ఆళ్ల నాని.. ఎట్టకేలకు గతేడాది చివర్లోనే వైసీపీకి గుడ్‌బై చెబుతూ పార్టీకి.. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరనున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి స్థానిక నాయకత్వం అడ్డుపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఆలస్యం అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments