Webdunia - Bharat's app for daily news and videos

Install App

#UnionBudget2018 : విశాఖ జోన్ ఊసేలేదు.. పోలవరం ప్రస్తావనే లేదు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా రిక్తహస్తం చూపించారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విభజన రాష్ట్రమైన నవ్యాంధ్ర ప్ర

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (13:55 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా రిక్తహస్తం చూపించారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విభజన రాష్ట్రమైన నవ్యాంధ్ర ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా, విభజన చట్టంలో ఇచ్చిన హమీల్లో ప్రధానమైవాటిని కూడా పూర్తి చేస్తామన్న భరోసా ఇవ్వలేక పోయారు. కేవలం విద్యా సంస్థల అభివృద్ధికి మాత్రం ఆయన తూతూమంత్రంగా నిధులు కేటాయించారు.
 
ముఖ్యంగా, విశాఖ రైల్వే జోన్ కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు.. అనేక అంశాలను ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా మాటమాత్రం కూడా ప్రస్తావించక పోవడం గమనార్హం. 
 
దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నవ్యాంధ్ర ప్రజలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ గురించి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ఏమైందంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. 
 
బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించకపోవడంపై తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే విషయంలో తెలుగు రాష్ట్రాల పేర్లు ప్రస్తావించని అరుణ్ జైట్లీ.. బెంగళూరు మెట్రోకు రూ.17 వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు రూ.17 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments