Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోరం, ఓటు వేయడానికి వచ్చి బస్సు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం - video

ఐవీఆర్
బుధవారం, 15 మే 2024 (09:43 IST)
పల్నాడు జిల్లా చిలుకలూరి పేట మండలం ఈపూరిపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రైవేట్ బస్సుని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీనితో ఐదుగురు వ్యక్తులు బస్సులో సజీవదహనమయ్యారు. పూర్తి వివరాలు చూస్తే... బాపట్ల జిల్లా చినగంజాము నుంచి చీరాల మీదుగా బస్సు హైదరాబాదు వెళ్తోంది. ఈ బస్సులోని వారంతా తమ నియోజకవర్గంలో ఓట్లు వేసి తిరిగి వెళుతున్నారు.
 
ఈ క్రమంలో బస్సు ఈపూరిపాలంకి చేరుకోగానే వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. టిప్పర్ లో చెలరేగిన మంటలు బస్సుకి అంటుకున్నాయి. దీనితో క్షణకాలంలోనే మంటలు బస్సులో వ్యాపించాయి. పలువురు తప్పించుకున్నప్పటికీ బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు సజీవ దహనమయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెంకి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు గా కళ్యాణ్ రామ్

Surya: గేమ్ ఛేంజర్ వల్ల సూర్య రెట్రో లో మెయిన్ విలన్ మిస్ అయ్యింది : నవీన్ చంద్ర

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments