Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (10:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన రైలు ప్రమాదంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
విజయనగరం జిల్లా చీపురుపల్లికి సమీపంలోని బాతువా - సిగడం రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి ఘోరం జరిగింది. రైలు పట్టాలపై ఐదుగురు శవాలుగా తేలారు. వీరంతా అస్సాం వాసులే. రైలు పట్టాలు దాటుతుండగా, రెప్పపాటులో దూసుకొచ్చిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
కోయంబత్తూరు నుంచి సిల్చార్‌ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు (12515)లోని జనరల్‌ బోగీలో స్వల్పంగా పొగలు వచ్చాయి. దీంతో అందులోని ప్రయాణికులు చైన్‌లాగారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామ సమీపంలో రాత్రి 8.30 గంటల సమయంలో రైలు నిలిచిపోయింది. రైలు ఆగిన వెంటనే అందులోని కొందరు ప్రయాణికులు రెండు వైపుల నుంచి కిందికి దిగారు. 
 
ఒకవైపున కొందరు పట్టాలపైన నిల్చుని ఉండగా... అదే ట్రాక్‌పైకి భువనేశ్వర్‌ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020) దూసుకొచ్చింది. అమిత వేగంతో వచ్చిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలపై ఉన్న ప్రయాణికులు గమనించలేకపోయారు. దానిని గమనించి పక్కకు తప్పుకునేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 
 
రైలు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోయంబత్తూరు-సిల్చార్‌ ఎక్స్‌ప్రెస్‌లోనే శ్రీకాకుళం తరలించి ఆస్పత్రిలో చేర్చారు. మృతులంతా అసోంకు చెందిన వారని తేలింది. 
 
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments