Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడు, కొత్త భార్య ప్రియుడితో జంప్

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (16:25 IST)
మొదటి భార్య చనిపోయి 6 నెలలయింది. పిల్లల సంరక్షణ సమస్య కావడంతో అటువైపు, ఇటువైపు బంధువులు మరో పెళ్లి చేసుకోవాలని అతడిపై వత్తిడి తెచ్చారు. వారి మాట కాదనలేక రెండో పెళ్లికి సరేనన్నాడు. వచ్చిన కొత్త పెళ్లికూతురు తెల్లారకముందే ప్రియుడితో పారిపోయింది.
 
వివరాలు చూస్తే... అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లికి చెందిన ఓ వ్యక్తి భార్య చనిపోయింది. ఆరు నెలలుగా పిల్లల సంరక్షణ బాధ్యతను అతడే చూసుకుంటూ వస్తున్నాడు. ఐతే వారి సంరక్షణ బాధ్యత కాస్త ఇబ్బందిగా వుండటంతో ఇరు కుటుంబాల బంధువులు మరో పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీనితో అతడు కూడా కాదనలేకపోయాడు.
 
గత నెల 28న పెద్దల సమక్షంలో అతడి వివాహం ఘనంగా చేసారు. కాపురానికి భర్తతో పాటు వచ్చిందా యువతి. ఐతే రాత్రంతా ఇంట్లోనే వున్న ఆమె తెల్లారేసరికి కనిపించకుండా పోయింది. ఇంట్లో వున్న 3 తులాల బంగారంతో పాటు రూ. 80 వేలు తీసుకుని తన ప్రియుడితో కలిసి ఒడిశా రాష్ట్రానికి పారిపోయినట్లు కనుగొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహిత కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments