Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో వాళ్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయించాలి: అనిత

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (08:10 IST)
మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని విశాఖలో ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత ఖండించారు. ఈ డిమాండ్ ఎవరు చేశారో వాళ్ళ ఇంట్లోని మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయించాలని ఎద్దేవా చేశారు.

వైసీపీ సర్కార్‌పై అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కాదని.. అరాచక దినోత్సవమని వ్యంగ్యాస్త్రం సంధించారు. వైసీపీ చేసే తప్పుడు పనులకు ‘సాక్షి’ కరపత్రంగా మారిందని విమర్శించారు.

‘రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న’ అంటూ ఒక మంత్రి టిక్‌టాక్‌లు చేసుకొనే కేబినెట్ ఇక్కడ ఉందన్నారు. ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా వైసీపీ ప్రయత్నం చేస్తోందని, ఇదేమి న్యాయమని ఆమె ప్రశ్నించారు.

టీడీపీ అంటే వైసీపీకి భయమని, అందుకే నామినేషన్‌లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ 9 నెలల పాలనలో కనీసం 9 సామాజిక వర్గాలైనా సంతోషంగా ఉన్నాయా అని నిలదీశారు. ఓడిపోతామని తెలిసినా వర్ల రామయ్య హ్యాపీగా రాజ్యసభకు పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

టీటీడీ బోర్డులో ఒక దళితుడు కూడా లేడని, దళితులకు వైసీపీ అన్యాయం చేసిందని, దీనికి అధికార పార్టీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సాహిస్తున్నారని, వారి పరిపాలన అంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు.

మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని విశాఖలో ఒక వైసీపీ ఎమ్మెల్యే  చేసిన వ్యాఖ్యలను ఖండించిన అనిత.. ఈ డిమాండ్ ఎవరు చేశారో వాళ్ళ ఇంట్లోని మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయించాలని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments