Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశాల నుండి వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

Advertiesment
విదేశాల నుండి వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
, గురువారం, 12 మార్చి 2020 (05:30 IST)
కోవిద్-19 పట్ల ప్రజల్లో చేయదగిన, చేయకూడని ప‌నుల‌పై అవగాహన కలిగించేందుకు గ్రామ స్థాయిలో పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా వైరస్ పై బుధవారం ఆమె అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పిలు, డిఎంఅండ్ హెచ్చ్ఓలు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు.

ఈ వీడియో సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంచే విధంగా వచ్చిన వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా ఇంటింటా వెళ్ళి తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇటలీ నుండి ఫిబ్రవరి 10 తర్వాత 75 మంది రాష్ట్రానికి వచ్చారని వారందరినీ విధిగా హోం ఐసోలేషన్ లో ఉంచాలని అన్నారు.

ఇటలీ నుండి వచ్చిన 75 మందిలో 73 మందికి కరోనా వైరస్ లక్షణాలు లేవని తేలిందని అని అయినప్పటికీ వారందరినీ 14 రోజులపాటు హోం ఐసోలేషన్ లో ఉంచాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇటలీ, ఇరాన్ కరోనా వైరస్ కు సంబంధించి హాట్ స్పాట్ లుగా ఉన్నాయని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక యాప్ రూపొందించిదని ఆ యాప్ లో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను అప్ లోడ్ చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.

అంతేగాక వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్ ఆ వివరాలు అప్ లోడ్ చేయడంతోపాటు జిల్లా కలెక్టర్లు, డిఎంఅండ్ హెచ్ఓలకు కరోనా లక్షణాలున్న వారి వివరాలను వెంటనే తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివరాలు సేకరించి యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.రెండు రోజుల్లోగా ఈవివిరాలను సేకరించి అప్ లోడ్ చేయాలని, వారిని ఐసోలేషన్ లో ఉంచాలని సిఎస్ నీలం సాహ్ని కలక్టర్లను ఆదేశించారు. 
                                           
ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పివి రమేశ్ మాట్లాడుతూ విదేశాల నుండి వచ్చిన వారు ఎవరెవరిని ఎక్కడెక్కడ కలుసుకున్నారు, ఏఏ ప్రాంతాల్లో ఏవిధంగా పర్యటించారనే వివరాలను సేకరించి అలాంటి వారందరినీ 14రోజులపాటు హోం ఐసోలేషన్ లో ఉంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ కు సంబంధించి రూపొందించిన యాప్ పై విస్తృత ప్రచారం చేసి ప్రజలందరికీ అవగాహన కలిగించాలని చెప్పారు.ఇళ్ళలో ఉండే వారు మాస్క్ లను ధరించాల్సిన అవసరం లేదని,ధరించిన మాస్క్ లను సక్రమంగా డిస్పోజ్ ఆప్ చేయాలని లేకుండా వాటిద్వారా కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

గ్రామ స్థాయి వరకూ ఐఇసి(ఇన్పర్మేషన్,ఎడ్యుకేషన్ అండ్ కమ్యునికేషన్) యాక్టివిటీనీ పెద్దఎత్తున చేపట్టి ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని కోరారు. వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో విదేశాల నుండి వచ్చిన వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానం విదేశీ భక్తులు కొంతకాలం వరకూ తిరుమలకు రావద్దని లేఖ వ్రాసిందని క్యూలైన్లు అన్నిటిలో నిరంతరం క్లీనింగ్ చర్యలు తీసుకుంటున్నారని అదే రీతిలో రాష్ట్రంలోని మిగతా ప్రధాన దేవాలయాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనా వైరస్ నివారణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాశ్రయాలు,రైల్వే స్టేషన్లు,బస్సు స్టేషన్లలో క్లీనింగ్ చర్యలు పెద్దఎత్తున చేపట్టాలని సూచించారు.

తొలుత వైద్య  ఆరోగ్యశాఖ ఇన్చార్జి కమిషనర్ వి.విజయరామరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనాకు సంబంధించి లక్షా 13వేల 702 కన్పార్మడ్ కేసులు నమోదు కాగా 4వేల మంది వరకూ చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో తెలిపిందని చెప్పారు.భారతదేశంలో ఇప్పటి వరకూ 52 కన్పర్మడ్ కేసులు నమోదు అయ్యాయని,కాగా మన రాష్ట్రంలో 46 కోరనా అనుమానిత కేసులు నమోదు కాగా వాటిలో ఒకటి పాజిటివ్ కేసుగా నమోదు అవ్వగా 36 నెగిటవ్ రాగా మరో 9కేసులకు సంబంధించి ల్యాబ్ నివేదికలు అందాల్సి ఉందని తెలిపారు.

అదే విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం 500 మందిని అబ్జర్వేషన్లో ఉంచగా వారిలో 260మందిని హోం అబ్జర్వేషన్, 14మందిని ఆసుపత్రి అబ్జర్వేషన్లోను ఉంచగా 226 మందికి 28 రోజుల అబ్జర్వేషన్ పూర్తయిందని వివరించారు.నెల్లూరు జిల్లాలో కన్పర్మడ్ కేసు నమోదు కాగా ఆజిల్లాకు రెండు రాష్ట్రస్థాయి బృందాలను పంపడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 8వేల 
375 పిపిఇ మాస్క్ లను వినియోగంలో ఉంచగా మరో 5వేల 882 బఫర్ స్టాక్లో అందుబాటులో ఉంచామని చెప్పారు.

అదే విధంగా 17వేల 558 ఎన్-95 మాస్క్ లను వినియోగంలో ఉంచగా మరో 84వేల 786 మాస్క్ లను బఫర్ స్టాకులో ఉంచామని వివరించారు.జిల్లా స్థాయిలో కోవిద్ పర్యవేక్షణకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసేందుకు ఒక అధికారిణి నియమించాలని,క్షేత్రస్థాయిలోని వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎన్నికలు విధులు కేటాయించవద్దని సిఎస్ ను కోరగా అందుకు ఆమె అంగీకరించారు.

సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, అగ్నిమాపక శాఖ డిజి ఎఆర్ అనురాధ, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలారావు, సియం వైద్య ఆరోగ్య సలహాదారు హరికృష్ణ, ఇతర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్.. ఎయిర్‌‌‌‌ ఇండియా కొత్త ఆఫర్స్‌‌