Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

ఠాగూర్
శుక్రవారం, 23 మే 2025 (10:17 IST)
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా అసలే ఆర్థిక కష్టాల్లో చిక్కుకునివున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఆగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ సేషన్-2 విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. 
 
ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం ఎస్ఎంఎస్-2లోని ఒక పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీమ్‌లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 
 
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది. 
 
కాగా, ఆర్థిక కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయించిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments