Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

ఠాగూర్
శుక్రవారం, 23 మే 2025 (09:30 IST)
వైకాపా నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై ఏపీ పోలీసులు ఒకదాని తర్వాత ఒక కేసు నమోదు చేస్తున్నారు. దీంతో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా బోరుగడ్డ అనిల్‌కు గుంటూరు నాలుగో కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
 
తన స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలంటూ పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును 2016 మే 9న అనిల్ బెదిరించాడు. అప్పట్లో సర్వేయర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అనిల్ గత ఎనిమిది సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు.
 
దీంతో అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో అనంతపురం జైలులో ఉన్న అనిల్‌‍ను మంగళవారం పీటీ వారెంట్‌పై పోలీసులు గుంటూరు తీసుకువచ్చారు. గుంటూరు ఆరవ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సి ఉండగా, ఆ మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఇన్‌చార్జి అయిన నాలుగో కోర్టు మెజిస్ట్రేట్ శోభారాణి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు అనిల్‍కు వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
 
మరోవైపు, అనిల్ బెయిల్ పిటిషన్‌ను నరసరావుపేట రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం గాయత్రి మంగళవారం డిస్మిస్ చేశారు. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో 'మార్చి 24న పోలీసులు ఆయన్‌ను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అప్పటి నుంచి రిమాండ్ పోడిగిస్తూ వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments