Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణసంచా షాపులో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (13:06 IST)
దీపావళి సందర్భంగా విజయవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో ఆదివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 
 
ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలకు నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. మొత్తం పదిహేను దుకాణాలకు మంటలు వ్యాపించగా.. ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. 
 
దీపావళి నేపథ్యంలో విజయవాడలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్‌లో 20 బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. బాణసంచాకు నిప్పంటుకోవడంతో చుట్టుపక్కల దుకాణాలకూ మంటలు వ్యాపించాయి. 
 
భారీ శబ్దాలతో పేలుళ్లు, ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డ మంటలను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో జింఖానా గ్రౌండ్స్‌కు చేరుకుని మంటలను ఆర్పేశారు. 
 
అప్పటికే పదిహేను దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అందులో కొన్ని పూర్తిగా కాలిబూడిదయ్యాయని, ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments