Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (10:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 
కాగా, సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేశ్, దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖామంత్రి పి.నారాయణ, పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ కార్యాలయాలు ఉండటం గమనార్హం. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!! 
 
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ టీవీ, సినిమాల్లో నటించనున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సినీ, సీరియల్ నటిగా కొనసాగిన విషయం తెల్సిందే. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె తన నటనకు దూరంగా ఉంటున్నారు. 
 
అయితే, తాజా సమాచారం మేరకు ఆమె తిరిగి సినిమాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఒక సిరీస్ కోసం ముఖానికి మేకప్ వేసుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. 
 
గతంలో పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రలను పోషించిన స్మృతి ఇరానీ.. "అమర్ ఉపాధ్యాయ్‌" అనే సిరీస్ కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు, ఈ విషయమై ఇప్పటికే వారిని సంప్రదించినట్టు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి. 
 
ఏక్తా కపూర్ కోరిక మేరకు మరోమారు కెమెరా ముందు నటించేందుకు స్మృతి అంగీకారం తెలిపారని, తులసి పాత్ర కోసం ఆమె సన్నద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై ఏక్తా కపూర్ టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేద. అలాగే, కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కూడా స్పందించకపోవడం గమనార్హం. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments