చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్ కాబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై రవీంద్రా జడేజా స్పందించారు. "నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయొద్దు.. ధన్యవాదాలు" అంటూ పోస్టు పెట్టారు. తద్వారా తాను వన్డేలలో మరికొంత కాలం పాటు కొనసాగుతానని పరోక్షంగా వెల్లడించారు.
2025 చాంపియన్స్ ట్రోఫీ సాధిస్తే గెలిస్తే జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జడేజా తన ఓవర్ల కోటాను పూర్తి చేయగానే కోహ్లీ పరుగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకోవడంతో, జడేజా వీడ్కోలు పలుకుతారనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
గత యేడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్రా జడేజా ట్వంటీ20లకు వీడ్కోలు పలికారు. ఇపుడు చాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఈ ముగ్గురు ఆటగాళ్లు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని రోహిత్ శర్మ ఇదివరకే ఖండించారు.