Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడు ఫార్మెట్లలో అదరగొట్టిన భారత బౌలర్ ఎవరు?

Jasprit Bumrah

ఠాగూర్

, గురువారం, 2 జనవరి 2025 (10:24 IST)
గత యేడాది టీ20, వన్డే, టెస్ట్ ఫార్మెట్‌లలో బాగా రాణించిన భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మెట్లలో అదరగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. తాను ఆడిన మొత్తం 34 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 86 వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 49 వికెట్లతో రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుస స్థానాల్లో రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. 
 
గత సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకమైనది. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా ముద్దాడింది. అంతేకాదు కీలకమైన ద్వైపాక్షిక సిరీస్లను కూడా గెలుచుకుంది. భారత విజయాలలో కీలక పాత్ర పోషించిన బౌలర్లు పెద్ద సంఖ్యలో వికెట్లను కొల్లగొట్టారు. 2024లో టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. 
 
మొత్తం 34 ఇన్నింగ్స్‌లలో కలిపి బుమ్రా ఏకంగా 86 వికెట్లు సాధించాడు. ఎంత మెచ్చుకున్నా తక్కువే అనేలా అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా తన సత్తా చాటుకున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 28 ఇన్నింగ్స్ 49 వికెట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచాడు. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులో ఉన్నప్పటికీ చోటు దక్కించుకొని జడేజా ఈ వికెట్లు సాధించడం విశేషం. అయితే, పరిమితి ఓవర్ల క్రికెట్లో మాత్రం జడేజా అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
 
ఇక ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ 21 ఇన్నింగ్స్ 47 వికెట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో మాత్రమే ఆడి ఇన్ని వికెట్లు సాధించడం గమనార్హం. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 23 ఇన్నింగ్స్ 40 వికెట్లు తీసి 2024లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగవ భారతీయ బౌలరుగా నిలిచాడు. టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత సుందర్ ప్రదర్శన మెరుగుపడుతోంది. అతడికి అవకాశాలు కూడా దక్కుతున్నాయి. రవిచంద్రన్ అశ్విన్‌కు వారసుడిగా మారేలా ఈ యువ ఆటగాడు కనిపిస్తున్నాడు. 
 
ఇక హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గతేడాది మొత్తం 34 ఇన్నింగ్స్‌ల్లో 40 వికెట్లు తీశాడు. ప్రదర్శన ఎలా ఉన్నా మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకుని టీమిండియాకు కీలక ఆటగాడిగా రాణించాడు. అయితే, బౌలర్ అశ్విన్ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునుపటి స్థాయిలో ఫిట్‌గా లేనంటున్న జార్ఖండ్ డైనమెట్!!