Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువ : యనమల రామకృష్ణుడు

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (15:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వైకాపా ప్రభుత్వం శుక్రవారం 2019-20 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై టీడీపీ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువ అంటూ వ్యాఖ్యానించారు. మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దశ ఉంది కానీ దిశ లేదన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పే జగన్ నేను తిన్నాను అని కూడా చెప్పుకుంటే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
దాదాపు రూ.48 వేల కోట్లు అప్పు తేవటానికి సిద్ధమయ్యారంటూ విమర్శించారు. మా ప్రభుత్వం అప్పులపై ఎన్నో మాట్లాడారు, కానీ వడ్డీలేని రుణాలపై ఇంత హడావుడి చేసి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. సాంఘిక సంక్షేమానికి బాగా తగ్గించారన్నారు. జలవనరుల్లోనూ రూ.వెయ్యి కోట్లు తగ్గించారనీ, వ్యవసాయ రంగానికి అంతంత మాత్రమే కేటాయింపులు చేశారన్నారు. 

రాష్ట్రంలో వేరే నాయకుడే లేనట్లు అన్ని పథకాలకు వై.ఎస్.ఆర్, జగన్ పేర్లే పెడుతున్నారనీ, రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారని వీళ్ళ పేర్లు పెట్టారంటూ మండిపడ్డారు. ఫ్యాక్షన్ కుటుంబం పేర్లు ప్రజా పథకాలకు పెట్టడం ఏంటిని ఆయన ప్రశ్నించారు. మా పథకాల పేర్లు మార్చి వాటికి కేటాయింపులు చేశారనీ, కొన్ని పథకాలను రద్దు చేసి ప్రజలను రోడ్డున పడేస్తున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments