Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాస్తవాలకు ప్రతిరూపంగా శ్వేతపత్రాలు : మంత్రి బుగ్గన

Advertiesment
వాస్తవాలకు ప్రతిరూపంగా శ్వేతపత్రాలు : మంత్రి బుగ్గన
, బుధవారం, 10 జులై 2019 (17:34 IST)
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ, వాస్తవాలకు ప్రతిరూపంగా వైట్ పేపర్ విడుదల చేస్తున్నట్టు చెప్పారు. 
 
జాతీయ స్థాయిలో పోలిస్తే ఏపీ స్థూల ఉత్పత్తి చాలా తక్కువగా ఉందనీ, 2004 నుంచి 2009 వరకూ ఏపీ 12 శాతం వృద్ధిలో ఉందని గుర్తుచేశారు. 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రానికి ఆర్థికంగా బ్యాడ్  పీరియడ్, 
 
2014 నుంచి 2019 వరకూ వ్యవసాయంలో వృద్ధి సాధించినట్లు లేని లెక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయంలో వృద్ధి రేటు బాగా తగ్గిందన్నారు. చేపల ఉత్పత్తి పెరిగితే వ్యవసాయంలో వృద్ధి రేటు పెరిగినట్లు కాదన్నారు. 
 
జీవీఏ 2014తో పోలిస్తే 2017కు తగ్గిందని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణం దేశవ్యాప్తంగా తగ్గితే ఏపీలో మాత్రం తీవ్ర స్థాయిలో పెరిగిందన్నారు. విభజన తర్వాత ఏపీకి అప్పులు బాగా పెరిగిపోయాయని చెప్పారు. 2014లో రెవిన్యూ లోటు 14 వేల కోట్లు ఉంటే 2019కి రూ.66 వేల కోట్లకు చేరిందన్నారు. 
 
రాష్ట్రానికి ఉపయోగపడేలా ఎక్కడా ఖర్చు పెట్టలేదని చెప్పారు. అనవసరమైన ఖర్చులు అధికంగా పెరిగిపోయాయనీ, ఎఫ్ఆర్‌బీఎం చట్టం ప్రకారం స్థూల జాతీయ ఉత్పత్తిలో 3 శాతం మాత్రమే అప్పుకు అవకాశం ఉంటే 4.08 శాతం అప్పులు చేశారని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరత్నాలే అభివృద్ధి సూత్రాలు... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి