27న రాజధానిపై తుది నిర్ణయం.. చిరు వ్యాఖ్యలు వ్యక్తిగతం

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (11:32 IST)
ఏపీ రాజధానిపై వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుందన్నారు. ఆ రోజే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్ర‌ రాజ‌ధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 
 
రాజ‌ధాని పై జీఎన్ రావు కమిటీపై  కీలక సూచనలు చేసిందని, దానిపైనే  కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. అయితే అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని కమిటీ చెప్పిందని మంత్రి బొత్స‌ వెల్లడించారు. కాగా అమరావతి పేరుతో టీడీపీ దోపిడీకి పాల్పడిందని మంత్రి బొత్స ఆరోపించారు.
 
ఏపీకి మూడు రాజ‌ధానుల‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ చిరంజీవి స్వాగ‌తించ‌డం అది అయన వ్య‌క్తిగ‌త‌మని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేవీపీ అన్నారు. 
 
మూడు రాజధానుల ప్రతిపాదనపై తమ పార్టీ నిర్ణయం ఈ నెల 27 తర్వాతే వెలువడుతుంద‌న్నారు. కాగా చిరంజీవ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పార్టీ వర్గాలు మాత్రం ఆయ‌న‌ కాంగ్రెస్ లోనే ఉన్నాడని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి వ్యాఖ్యలపై  కేవీపీ స్పందించడం ఆసక్తిక‌రంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments