Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ప‌రిశ్ర‌మ నుంచి ఒకే ఒక్క‌డు! మంత్రి పేర్నినానితో ఆర్.నారాయ‌ణ‌మూర్తి చ‌ర్చ‌!

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:57 IST)
ఏపీ సినిమా ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న వివాదాల‌పై సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో చ‌ర్చించ‌డానికి ఒకే ఒక్క‌డు ముందుకు వ‌చ్చాడు. ఎర్ర సినిమాలు తీసే న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఆర్ నారాయ‌ణ మూర్తి చొర‌వ తీసుకుని ముంద‌డుగు వేశాడు.
 
 
ఏపీ మంత్రి పేర్ని నానిని సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి కలిశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రిని కలిసిన నారాయణమూర్తి సినీ రంగాలకు చెందిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపు, థియేటర్ల మూసివేత వంటి విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో నారాయణమూర్తి మంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. థియోట‌ర్లు మూత‌ప‌డటంపై తీవ్రంగా చ‌లించిపోయిన ఆర్. నారాయ‌ణ మూర్తి జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో మాట్లాడ‌టానికి వ‌చ్చారు.
 
 
అయితే, ఇప్ప‌టికే ఏపీలో సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. సీల్‌ వేసిన థియేటర్లను మళ్లీ తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. నెల రోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశించింది. ఇందుకోసం జాయింట్‌ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని థియేటర్ల యజమానులను సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆదేశించారు. దీంతో 9 జిల్లాల్లోని 83 థియేటర్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. నిర్దేశించిన టికెట్ల రేట్ల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని. నియమాలు అతిక్రమిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దాడులు చేసి థియేటర్లను మూసివేసింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments