ఇతడు పశువు కంటే హీనం... నెల్లూరులో కన్నకూతురిపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (16:40 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కన్నకూతురిపై తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామాంధుడు అటవీశాఖలో ఉద్యోగి. 
 
కావలి సమీపంలోని పాతూరుకు చెందిన అటవీశాఖ ఉద్యోగి భాస్కర్‌కి 13యేళ్ళ కుమార్తె ఉంది. తల్లి సుప్రజ వారంరోజుల కిందట తన సొంత ఊరు తిరుపతికి వెళ్ళింది. ఇంట్లో కుమార్తె ఒక్కటే ఉండటంతో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండురోజుల పాటు ఆమెను శారీరకంగా అనుభవించాడు. 
 
విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. తల్లి సుప్రజ ఇంటికి వచ్చినాసరే విషయాన్ని బయటకు చెప్పలేదు కుమార్తె. తెల్లవారుజామున బాధతో ఏడుస్తూ ఇంటి ముందు కూర్చున్న కుమార్తెను ప్రశ్నించింది తల్లి. దీంతో అసలు విషయం బయటపడింది. స్థానికంగా ఉన్న పోలీస్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది భార్య. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments