నవంబర్ 1వ తేదీ నుంచి రైతులు మహా పాదయాత్ర

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (09:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1వ తేదీ నుంచి రైతులు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహా పాదయాత్రకు పలువురి మద్దతును రైతులు కోరుతున్నారు.

మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు. ఈ మహా పాదయాత్ర తుళ్ళూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజులపాటు సాగనుంది.

డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. దాదాపు రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అమరావతి పరిరక్షణలో భాగంగా మహా పాదయాత్ర తలపెట్టినట్లు రైతులు చెప్పారు. రాజధాని కోసం మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కళ్యాణ్, మనోహర్‌లు మహా పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రైతులు, జేఏసీ నేతలలు విజ్ఞప్తి చేసారు. రైతుల మహా పాదయాత్ర  విజయవంతం కావాలని మనోహర్ ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments