టీవీ9 నకిలీ ఐడెంటి కార్డుతో దందా... వేమూరి అరెస్ట్!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:20 IST)
టీవీ 9 పేరు చెప్పి, అంద‌రినీ బెదిరించ‌డం, డ‌బ్బులు డిమాండు చేయ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. అయితే, అంతా ఆయ‌న టీవీ 9 రిపోర్టర్ గా భావించి, మ‌ర్యాద ఇవ్వ‌డం చేసేవారు. కానీ, ఇపుడు ఒక్క‌సారిగా తేలిపోయింది. అత‌ను రిపోర్ట‌ర్ కాదు...న‌కిలీ అని.
 
కృష్ణా జిల్లా పామర్రు పెదపారుపూడి మండలంలో నకిలీ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు స్థానిక  పోలీసులు. టీవీ 9 నకిలీ ఐడెంటి కార్డుతో మండలంలో చలామణి అవుతున్న చిన్నపారుపూడి గ్రామానికి చెందిన వేమూరి విద్యాసాగర్ ను అరెస్ట్ చేశారు.
 
అత‌ను కొంత మందిని టీవీ 9 పేరుతో బెదిరించి, డబ్బులు వసూళ్ళ‌కు పాల్పడుతునట్లు పోలీసుల‌కు ఇప్ప‌టికే ఫిర్యాదులు అందాయి. ఈ న‌కిలీ విలేక‌రి వేమూరి విద్యాసాగర్ పై పోలీసులు ఒక కంట క‌నిపెడుతూనే ఉన్నారు. ఇపుడు అవ‌కాశం దొర‌క‌డం, ఫిర్యాదులు గ‌ట్టిగా రావ‌డంతో అరెస్ట్ చేశారు. ఈ నకిలీ విలేకరిపై ఐపిసి 417, 419 సెక్షన్ల కింద ఎస్ఐ రంజిత్ కుమార్ కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments