Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబుల కోసం లిక్కర్ కార్డులు.. ఫేక్ లిక్కర్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబుల కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు లిక్కర్ కార్డులు ప్రవేశపెట్టనుంది. మద్యం కొనాలంటే ఈ కార్డు ఉండాల్సిందే లేకుంటే వైన్ షాపు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఈ కార్డు కావాలంటే రూ.5 వేలు డిపాజిట్ కట్టాల్సి వుంటుంది.
 
కార్డులో అమౌంట్ అయిపోతే బ్యాంకు అకౌంట్ నుంచి రీచార్జ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. మరో అడుగు ముందుకేసిన ఎక్సైజ్ శాఖ ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది.
 
ఇక లిక్కర్ కార్డులు జారీ చేసిన తర్వాత మద్యం తాగేవాళ్ల సంఖ్య భారీగా తగ్గుతుందని ఏపీ సర్కారు భావిస్తోంది. రూ.5 వేల డిపాజిట్ కట్టి లిక్కర్ కార్డు కొనే ఆర్థిక స్తోమత తక్కువ ముందికే ఉంటుంది.  అంటున్నారు. 
 
మిడిల్ క్లాస్ ప్రజలు, కూలీలు, పేదలు ప్రతి రోజు వచ్చే కూలీ డబ్బుతోనే మద్యం కొంటుంటారు. లిక్కర్ కార్డులు జారీ అయితే జేబులో డబ్బుతో మద్యం కొనే పరిస్థితి ఉండదు. ఒక వేళ పక్కవారి కార్డు వాడేసి మందు కొందామనుకుంటే అది ఎంత మాత్రం కుదరదు. 
 
ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి లిక్కర్ కార్డు ద్వారా 3 బాటిళ్ల కంటే ఎక్కువ మద్యం అమ్మరు. ఒకే లిక్కర్ కార్డు నుంచి పరిమితికి మించి మద్యం కొంటే 3 నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఒకసారి కార్డు రద్దైతే ఎప్పటికీ కొత్త కార్డు జారీ చేయరు. రద్దైన లిక్కర్ కార్డులో డబ్బు ఉన్నా తిరిగి ఇవ్వరు. దీంతో పేదలు తాగుడుకు దూరం అవుతారని అధికారులు భావిస్తున్నారు.  
 
ఏపీలో ఇప్పటికే ప్రైవేటు వైన్ షాపులు, 40 శాతం బార్లను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రైవేటు వైన్ షాపుల స్థానంలో సర్కారే మద్యం దుకాణాలను తెరిచింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్ముతూ ప్రజల చేత తాగుడు మాన్పించే ప్రయత్నం చేస్తోంది.  
 
అంతేగాకుండా ఎక్సైజ్ శాఖ జారీ చేసే లిక్కర్ కార్డు కావాలంటే 25 ఏళ్లు పైబడి ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు ఏటా కార్డు రెన్యూవల్ చేసుకోవాలంటే మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. 
 
తాగుడు మాన్పించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో లిక్కర్ డీ అడిక్షన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి కోసం ఐదేళ్లలో రూ. 500 కోట్లు కేటాయించనుంది.
 
ఇదిలా ఉంటే.. ఏపీలో మద్యం అమ్మకాల కోసం ప్రభుత్వం లిక్కర్ కార్డ్ ప్రవేశపెడుతోందని ఇది అదే అంటూ సోషల్ మీడియాలో ఓ కార్డ్ తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు లిక్కర్ కొనుగోలు చేయాలి అనుకునేవారు ముందుగా రూ.5000 చెల్లించి లిక్కర్ కార్డును పొందాలని లిక్కర్ కార్డులోని అమౌంట్ పూర్తయ్యాక మళ్ళీ ఐదువేలు చెల్లించి కార్డు రెన్యూవల్ చేసుకోవాలనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. 
 
ఈ కార్డు అంత ఈజీగా రాదని... దీనికి కొన్ని కండీషన్లు కూడా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ ప్రభుత్వానికి ఇలా ఆలోచన ఏదీ లేదని తేలడంతో... నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ లిక్కర్ కార్డ్ ఫేక్ అని తేలిపోయింది.
 
ఏపీలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తామని ప్రకటించిన సీఎం జగన్ సర్కార్... అందులో భాగంగా వైన్స్ షాపులు, బార్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఈ సంఖ్యను కుదిస్తామని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments