Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్‌కు అన్యాయం' .. ఇందులో తానూ భాగస్వామినే : తమ్మినేని సీతారాం

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (13:10 IST)
గతంలో మహానేత, స్వర్గీయ ఎన్.టి. రామారావుకు జరిగిన అన్యాయంలో తాను కూడా భాగస్వామినేనని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని - విపక్ష నేత చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని స్పందిస్తూ.. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
 
ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ, వైసీపీ ఆఫీసన్న విపక్ష నేత మాటలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ప్రజల జాగీర్‌ మాత్రమేనని స్పీకర్‌ స్పష్టం చేశారు. గతంలో సభలో ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం తప్పేనన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని స్పీకర్‌ తమ్మినేని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments