Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి పందేల్లో కోట్ల ఫేక్ నోట్లు... తేలు కుట్టిన దొంగల్లా పందెంరాయుళ్లు...

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (18:38 IST)
సంక్రాంతి సమయంలో కోస్తా జిల్లాల్లో అనధికారికంగా కోడిపందాలు జోరుగా సాగాయి. ప్రజాప్రతినిధులు సైతం హుషారుగా పాల్గొని, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రక్క రాష్ట్రాలలో నుండి అనేక మంది ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు, వేలాది మంది ఆసక్తితో కోడి పందాల్లో జోరుగా బెట్టింగ్‌లు కాసారు. అందులోనూ పెద్దనోట్ల రాకతో ఇది మరింత ఎక్కువ అయ్యింది. 
 
కృష్ణ జిల్లాలోని వంకనూరుకి చెందిన వ్యక్తి సిహెచ్ శ్రీనివాస్. కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లులో కోళ్ల పందాలలో పాల్గొని రూ.15,000 గెలుచుకున్నాడు, అయితే ఆ సొమ్మును తన ఖాతాలో వేసుకునేందుకు బ్యాంక్‌కి వెళ్లగా వాటిని నకిలీ నోట్లని చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. దాదాపు 10,000 రూపాయల విలువ చేసే 500, 2000 రూపాయల నోట్లను నకిలీవి అంటూ వారు పేర్కొన్నారు. 
 
నకిలీ డబ్బును అక్రమంగా సంపాదించినందున జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయాడు. అంతేకాకుండా చాలామంది వ్యక్తులు పందెంరాయళ్ల చేతుల్లో దారుణంగా మోసపోయి, తేలు కుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా ఉన్నారు. కంచికచర్ల పోలీసులు తెలంగాణ నుండి వచ్చి నకిలీ నోట్ల దందాను చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో శుక్రవారం నాడు తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్న రెండు గ్యాంగ్‌లను అరెస్ట్ చేసారు. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసులు ఉండడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments