నా పడక గదిలో నీ నగ్నత్వం చూపిస్తే.. మీ బతుకులు బాగుచేస్తా....

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (09:11 IST)
జ్యోతిష్యం పేరుతో ఓ నకిలీ జ్యోతిష్యుడు వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ నగ్నత్వం ఒక్కసారి చూపిస్తే మీ బతుకులు బాగుచేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ నకిలీ జ్యోతిష్యుడు బండారం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట సాయినగర్‌కి చెందిన వి.శంకర్‌రావు అనే వ్యక్తి దివ్యసాయి జ్యోతిషాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈయన బొటనవేలు, హస్త రేఖలు చూసి జాతకం చెప్పేస్తానంటూ ముమ్మరంగా ప్రచారం చేశాడు. ఈ క్రమంలో మన్నారుపోలూరుకు చెందిన ఓ వివాహిత ఆ మాటలు నమ్మింది. తమ ఆర్థిక బాధలు చెప్పుకొంది. ఆమె బాధలన్నీ శ్రద్ధగా ఆలకించిన శంకర్ రావు.. ఆమెకు ఓ సలహా ఇచ్చాడు. 
 
తాత్కాలిక ఉపశమనం కోసం కొంత సొమ్ము తెచ్చిస్తే పూజలు చేస్తానంటూ నమ్మించాడు. ఆ తర్వాత 'నీ కష్టాలన్నీ తీరాలంటే 9 రోజులు పూజ చేయాలి. అందుకోసం నగ్నంగా వీడియో తీసుకొని నాకు పంపించు. లేదంటే నా బెడ్‌రూములో నీ నగ్నత్వాన్ని చూపించు' అంటూ కోరాడు. ఆ నకిలీ జ్యోతిష్యుడి మాటల వెనుకవున్న వక్రబుద్ధిని పసిగట్టిన ఆ మహిళ అతన్ని పోలీసులకు పట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం