గుండ్లపాడును వెంటాడుతున్న ఫ్యాక్షన్ భూతం.. ఆ గ్రామంలో 18 హత్యలు

సెల్వి
సోమవారం, 2 జూన్ 2025 (12:51 IST)
గుండ్లపాడును ఫ్యాక్షన్ భూతం వెంటాడుతుంది. ఇప్పటికే ఆ గ్రామంలో 18 హత్యలు జరిగాయి. కానీ ఒక్క కేసుకు మాత్రమే శిక్షపడింది. మాచర్ల నియోజకవర్గంలోనే అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఇప్పటికీ ఫ్యాక్షనిజం పేట్రేగుతున్న గ్రామం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు. ఇటీవలి జంట హత్యలతో అది మరోసారి నిరూపితమైంది. 
 
ఈ హత్యాకాండల్లో ఎక్కువగా నష్టపోయింది టీడీపీ వారే. 1987లో జడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత జరిగిన ఓ ఘటనతో ఘర్షణలు ప్రారంభమయ్యాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 
 
1989 నుంచి గుండ్లపాడులో ప్రశాంతత కరువైంది. ఈ నేపథ్యంలో 1990లో రెండు గ్రూపుల మధ్య గొడవల్లో మూడు హత్యలు చోటుచేసుకున్నాయి. కేసులు నమోదు చేసిన పోలీసులు 9 మందిని రిమాండ్‌కు పంపారు. 2014లో తెలుగుదేశం పార్టీకి చెందిన తోట వెంకట నరసయ్యను వైఎస్సార్సీపీకి చెందిన తొమ్మిది మంది పొలంలో కత్తులతో నరికి దారుణంగా హతమార్చారు. 
 
2022లో తోట చంద్రయ్యపై వైఎస్సార్సీపీకి చెందిన చింత శివరామయ్య, మరో ఏడుగురు కత్తులతో దాడి చేసి అందరూ చూస్తుండగానే హతమార్చారు. ఇటీవల గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులను ప్రత్యర్థులు చంపేశారు. ఇలా గుండ్లపాడులో రక్తపాతం కొనసాగుతూనే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Bhagyashree Borse: యాక్షన్ రొమాన్స్ అన్ని జోన్స్ ఇష్టమే : భాగ్యశ్రీ బోర్సే

12A రైల్వే కాలనీ చూస్తున్నప్పుడు ఎవరు విలన్ గెస్ చేయలేరు : అల్లరి నరేష్

సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14న సిద్దం

Raja: క్షమాపణ, రాణి మారియా త్యాగం నేపథ్యంగా ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments