Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కేశినేని నానికి మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ వ‌ర్గీయుల మ‌ద్ద‌తు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (18:58 IST)
విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని నాయ‌క‌త్వాన్ని కొంద‌రు వ్య‌తిరేకిస్తుండ‌గా, మాజీ మంత్రి జ‌లీల్ ఖాన్ వ‌ర్గీయులు మాత్రం ఆయ‌న్ని స‌పోర్ట్ చేస్తున్నారు. కేశినేని భవన్లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) గారిని పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్, మాజీ కార్పొరేటర్ ఖాదర్ మర్యాద పూర్వకంగా కలిశారు. 
 
 
విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా నియ‌మించారు. దీనిని ఒక వ‌ర్గం నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నారు. ముఖ్యంగా బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా త‌దిత‌రులు ఎంపీ కేశినేనిని ఇంచార్జిగా నియ‌మించ‌వ‌ద్ద‌ని పార్టీకి నిర‌స‌న తెలిపారు. వారి మ‌ద్ద‌తు దారులు విజ‌య‌వాడ‌లో ఎంపీ కేశినేని నాని కార్యాల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చి మ‌రీ నిర‌స‌న తెలిపారు. అయితే, దీనికి విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎంపీ కేశినేనికి త‌న మ‌ద్ద‌తు తెలిపారు.
 
 
ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ, ఎంపీ కేశినేని నాని నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని మరింతగా బలోపేతం చేసి, 2024 ఎన్నికల్లో టీడీపీ జండా ఎగరేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments