సీఎం జగన్ రిజెక్ట్ చేసినవారే టీడీపీలోకి వెళ్తారు : మాజీ మంత్రి అనిల్

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (14:42 IST)
వచ్చే ఎన్నికల నాటికి అనేక మంది వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపపక్షమైన టీడీపీలోకి వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. తమ పార్టీ తరపున పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ నిరాకరించేవారే తెలుగుదేశం పార్టీలోకి వెళతారని ఆయన చెప్పారు. 
 
ఆయన బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు నగర ప్రజలపై మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణ రూ.1100 కోట్ల అప్పు పెడితే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా అప్పు లేకుండా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పుకునే ధైర్యం టీడీపీ నేతల్లో ఒక్కరికైనా ఉందా అని ఆయన నిలదీశారు. 
 
నెల్లూరు సిటీలో జరిగిన అభివృద్ధిపై ఈ జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు  సిద్ధమని తెలిపారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సినీ స్థానం నుంచి మంత్రి నారాయణ పోటీ చేసినప్పటికీ తాను బరిలో ఉంటానని చెప్పారు. ఇకపోతే, తమ పార్టీ నేతలు వైకాపాలోకి వెళుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, సీఎం జగన్ నిరాకరించే వారే టీడీపీలోకి వెళతారని చెప్పారు. రక్తం మరిగినవారు అధికారం కోసం ఎంతటి అడ్డుదారులైనా తొక్కుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments