Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాయామం చేస్తుండగా బెణికి కాలు.. సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (13:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కాలు బెణికింది. ఆయన వ్యాయామం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఈ నెల 5వ తేదీన కర్నూలు జిల్లా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణోత్సవానికి ఆయన హాజరుకావడం లేదు. మంగళవారం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెణికడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన తన ప్రయాణం రద్దు చేసుకున్నారు.
 
నోప్పి ఎంతకీ తగ్గకపోగా, సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో బుధవారం ఒంటిమిట్ట ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు గతంలోనూ ఇలాగే కాలికి గాయమైన విషయం తెల్సిందే. 
 
కాగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీన ఆయన ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ దర్శనం కోసం వెళ్లాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సివుంది. ఇందుకోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, కాలు బెణకడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకోగా, ఆ మేరకు అధికారులు జిల్లా యంత్రాంగానికి సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments