Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లని కుర్తా.. నల్లని ప్యాంటులో శాంతి దూతలా జగన్ నయా లుక్.. అదిరిపోయింది గురూ...!!

వరుణ్
మంగళవారం, 2 జులై 2024 (14:02 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్‌లో కనిపించారు. తెల్లని కుర్తా, నల్లని ఫ్యాంటు ధరించి కనిపించారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత మే నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైకాపా చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్... పులివెందుల నుంచి తొలుత హైదరాబాద్‌కు అక్కడ నుంచి బెంగుళూరులోని తన ప్యాలెస్‌కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కొత్త లుక్‌లో కనిపించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెల్లని కుర్తా, బ్లాక్ ప్యాంటులో మెరిసిపోయారు. వారం రోజులుగా బెంగుళూరులోనే ఉంటున్న ఆయన తన ప్యాలెస్‌కు వచ్చే అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇపుడీ ఫోటోలు సామాజికమాద్యమంలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫోటోలను చూస్తున్న అభిమానులు.. జగన్‌ను ఈ విధంగా ఎన్నడూ చూడలేదని అంటున్నారు. అంతేకాకుండా జగన్ ఓ శాంతిదూతలా కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే, జగన్మోహన్ రెడ్డి మంగళవారం బెంగుళూరు నుంచి విజయవాడ తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరు నుంచి విజయవాడకు వస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments