Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట ఆడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఇలాంటి వారితో బంగారు తెలంగాణ?

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (10:12 IST)
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేకాట ఆడుతూ వివాదాల్లో చిక్కుకున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో జూదం ఆడుతూ పేకాట రాయుడిగా పట్టుబడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ డిమాండ్​ చేశారు.
 
ఈ సందర్భంగా ఎర్రబెల్లి పేకాట ఆడుతూ ఉన్నాడంటూ ఫొటోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ నిషేధిత మత్తు పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో తింటూ మీడియా కంటికి చిక్కారని గుర్తు చేశారు. 
 
రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను బ్యాన్​ చేశారని, ఎక్కడైనా పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారని, కానీ మంత్రులకు ఎలా దొరికిందని, ఎవరు స్మగ్లింగ్​ చేస్తున్నారని ప్రశ్నించారు.  
 
తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేకాడుతూ పట్టుబడ్డ చిత్రాలు సామజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతున్నాయని, అలాంటి సన్నాసి మంత్రుల ద్వారా బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని శ్రవణ్​ ప్రశ్నించారు. 
 
సాధారణ పౌరులు వినోదం కోసం పేకాట ఆడితే కేసులు పెట్టి నానా హింసలు పెట్టే పోలీసులు ఎందుకు ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. గుట్కారాయుళ్ళు, గ్యాంబ్లర్స్‌తో బంగారు తెలంగాణ సాధ్యం కాదని, ఇలాంటి సన్నాసులకు మంత్రులుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే వీరిని మంత్రి పదవుల నుంచి బర్త్‌రఫ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని శ్రవణ్​డిమాండ్​ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments