Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్న భోజనంలో కొత్త రుచి... కొత్త మెనూ ఇదీ

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (11:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ఇపుడు సరికొత్త రుచిని సంతరించుకోనుంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా, పులివెందులలో తిన్నా, అమరావతిలో తిన్నా రుచి మారకూడదు. నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దు అని ఆయన ఆదేశించారు. శనివారం విద్యాశాఖ కార్యకలాపాలపై సమీక్షించిన సీఎం జగన్‌.. అధికారులకు పలు సూచనలు చేశారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ నెల 21 నుంచి భోజనంలో కొత్త మెనూ అమలు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త మెనూ అమలు నిమిత్తం ప్రస్తుతం చెల్లిస్తున్న ఖర్చులకు అదనంగా ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలకు 43 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 40 పైసల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు.
 
కొత్త మెనూ ఇదీ
సోమవారం: అన్నం, పప్పుచారు, గుడ్డుతో కూర, చిక్కీ
మంగళవారం: పులిహోర, టమాటా పప్పు, గుడ్డు
బుధవారం: కూరగాయలతో అన్నం, బంగాళా దుంప కుర్మా, గుడ్డు, చిక్కీ
గురువారం: కిచిడీ(పెసరపప్పు అన్నం), టమాటా చెట్నీ, గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, చిక్కీ
శనివారం: అన్నం, సాంబారు, పొంగలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆందోళనలో వున్నానంటున్న అల్లు అర్జున్

విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌ తో అనుష్క శెట్టి ఘాటి సిద్ధమవుతోంది

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments