లోన్ యాప్ వేధింపులు.. ఇంజనీరింగ్ విద్యార్థి కృష్ణానదిలో పడి ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 27 మే 2024 (17:49 IST)
లోన్ యాప్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. 
 
అవ‌స‌రం ఉండ‌డంతో ఇంట్లో తెలియ‌కుండా ఓ లోన్ యాప్‌లో రూ.10వేలు రుణం తీసుకున్నాడు. అయితే యాప్ నిర్వాహ‌కులు అత‌డిని రూ. 1ల‌క్ష క‌ట్టాలంటూ వేధింపుల‌కు గురిచేశారు. 
 
ఇంట్లో ఈ విషయం చెప్పడానికి భయపడిన వంశీ ఇంటి నుంచి ఈ నెల 25న వెళ్లిపోయాడు. అనంత‌రం తాను చ‌నిపోతున్న‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు సందేశం పంపాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌ని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. 
 
ఆందోళ‌న చెందిన కుటుంబీకులు రెండు రోజులుగా వంశీ కోసం గాలించారు. కృష్ణా న‌ది వద్ద అత‌ని మొబైల్ ఫోన్‌, బైక్‌, చెప్పుల‌ను గుర్తించిన పోలీసులు అందులో గాలింపు చర్యలు చేపట్టారు. 
 
అక్కడ వంశీ మృత‌దేహం దొరికింది. తండ్రి ఫిర్యాదు మేర‌కు తాడేప‌ల్లి పోలీసులు మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments