Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి సస్పెండ్... ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (10:47 IST)
ఏపీ హిందూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై సస్పెండ్ వేటుపడింది. గత వైకాపా ప్రభుత్వంలో కొందరు పెద్దల అండ చూసుకుని ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అనేక అక్రమాలకు తెరలేపారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసి, ఆమెపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది. 
 
కాగా, ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన కె.శాంతి అంశాన్ని పరశీలిస్తే, గత 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకూ ఆమె సహాయకమిషనర్‌గా పని చేశారు. ఆమెకు మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలోని దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్దంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాటి అవకతవకలపై నివేదిక పంపించారు. ఇందులో వివిధ అంశాలు పొందుపరిచారు. 
 
నాటి ఉల్లంఘనలపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు జిల్లా శాఖ నుంచి నివేదిక పంపించారు. ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలను ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్ రోడ్డులో సిద్దేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్డింగ్ రెస్ట్ హౌస్, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం నిర్వహించకుండా నచ్చినవారికి కట్టబెట్టారు.
 
సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్ పుష్పవర్ధన్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై ఇసుక పోశారు. లంకెలపాలెం వద్ద దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తర్వాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు, ఆలయాల వద్ద వ్యాపారాలు చేసే వారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. ఇందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. నగరంలోని పలు దేవాలయాలకున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి. ఇలా అనేక అక్రమాలకు ఆమె పాల్పడినట్టు నివేదికలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments