Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరు మున్సిపల్ పోల్ : 4 నెలల తర్వాత ఓట్ల లెక్కింపు

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (10:24 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ (మున్సిపాలిటీ)కి నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 50 డివిజన్లకుగాను మూడు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
దీంతో మిగిలిన వాటికి మార్చి 10న ఎన్నికలు జరిగాయి. అయితే అప్పట్లో వివాదాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఈ నెల 25న ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 
 
ఈ నేపథ్యంలో నగర శివారులోని సీఆర్ రెడ్డి కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన అధికారులు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
 
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. లెక్కింపులో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. 
 
మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 47 స్థానాల్లో పోటీ చేయగా, టీడీపీ 43, జనసేన 20 చోట్ల పోటీ చేసింది. ఇతర అభ్యర్థులతో కలిసి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30న మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments