Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రెంటు బిల్లుల కాల్చివేత‌... బెజ‌వాడ‌లో సిపిఐ గ‌రం గ‌రం!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:10 IST)
పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాల‌ని సిపిఐ విజ‌య‌వాడ నగర కార్యవర్గ సభ్యుడు కే వి భాస్కర రావు డిమాండ్ చేశారు. సిపిఐ విజ‌య‌వాడ‌లోని 58 డివిజన్ ఆధ్వర్యంలో హోచిమిన్ భవన్ వద్ద పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుత్ బిల్లుల‌ను సీపిఐ కార్య‌క‌ర్త‌లు ద‌హ‌నం చేశారు. 
 
ఈ సందర్భంగా కె వి భాస్కర రావు మాట్లాడుతూ, కరోనా కష్టాలతో నలిగిపోయిన ప్రజలకు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు సర్దుబాటు చార్జీల పేరిట కరెంటు చార్జీలను ఏకంగా యూనిట్ కి 1.23 పైసలు పెంచడం దారుణమన్నారు. ఇది వరకే పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలతోపాటు ప్రస్తుతం పెంచిన విద్యుత్ చార్జీలతో ప్రజల నెత్తిన పిడుగు పడినట్లుగా ఉంద‌ని పేర్కొన్నారు.
 
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే పోరాటాల ద్వారా ముందుకు వెళ్తామన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఎస్కే సుభాని, ఎల్ శివకుమార్, కె ఆదినారాయణ చంద్ర ,రవికుమార్, పి రాములు యన్ లక్ష్మీనారాయణ, ఎండి గౌస్ , నాగరాజు, నాగూర్ మీరా, మహిళా నాయకురాలు తమ్మిన దుర్గ ,పుష్ప ,కన్నమ్మ శంకరమ్మ,రాజ్యలక్ష్మి షకీలా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments