Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మృతిని జీర్ణించుకోలేక భర్త మృతి...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:22 IST)
భర్తలంటే భార్యలని వేధించి... చంపేసేవారే కాదు... వాళ్లకేమైనా అయితే... తట్టుకోలేకపోయే వాళ్లు కూడా ఉన్నారు కానీ... వేధించే భర్తలలాగా వీళ్లు పెద్దగా పాపులర్ కాలేరు... అటువంటి ఒక సంఘటనే ఇక్కడ చెప్పబోతున్నాం... 
 
వివరాలలోకి వెళ్తే... నూతన్‌కల్‌ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనను గురించి గ్రామస్థులు కథనం మేరకు... నూతనకల్‌ గ్రామానికి చెందిన బండ్లపల్లి శ్రీరాములు, మల్లమ్మకు శంకర్‌, ఆంజనేయులు అనే ఇద్దరు కుమారులు, స్వరూప అనే ఓ కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులూ, కుమార్తె జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం చెన్నై వెళ్లగా తల్లిదండ్రులు మాత్రం గ్రామంలోనే ఉంటున్నారు. 
 
సుమారు 9 నెలల క్రితం చెన్నైలో ఉంటున్న కుమారుల వద్దకు ఈ దంపతులు వెళ్లడం జరిగింది. అయితే ఈ నెల 2వ తేదీన మల్లమ్మ (48) బీపీ పెరిగి చెన్నైలో మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. 
 
కాగా... భార్య మృతిని జీర్ణించుకోలేని శ్రీరాములు మూడో రోజు చితాభస్మం ఎత్తుతూ తీవ్ర మనోవేదనకు గురై స్నానాలు చేసి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మూడురోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో కుమారులు, కుమార్తె విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments