Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (18:36 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (#Jagan) అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (#ED) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.793 కోట్ల విలువ చేసే దాల్మియా సిమెంట్ (#DalimaCement) ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం మార్చి 31వ తేదీన తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజుల దాల్మియాకు అక్రమంగా కట్టబెట్టారని అభియోగం ఉంది. దాల్మియా నుంచి జగన్ సుమారు రూ.150 కోట్ల ముడుపులు తీసుకున్నారని సీబీఐ (#CBI) చార్జిషీటు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ అటాచ్‌‍మెంట్ ఉత్తర్వులు ఈ నెల 15వ తేదీన రాత్రి దాల్మియా సిమెంట్స్‌కు అందాయి. కొనుగోలు చేసినపుడు ఆ భూమి విలువ రూ.377 కోట్లు కాగా, ఇపుడు రూ.793 కోట్లుగా పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం, నవాబ్ పేటలో 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments