స్నేహానికి వున్న పవరే వేరు. స్నేహితులు.. స్నేహం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా వుంటారు. స్నేహితుడు, స్నేహితురాలి కోసం త్యాగాలు చేసిన ఎందరో వ్యక్తులు మన దేశంలో వున్నారు. కుటుంబం, బంధువుల కంటే స్నేహం కోసం పడిచచ్చే వ్యక్తులు చాలామంది వున్నారు.
కట్ చేస్తే.. తన స్నేహితుడిని భుజాన ఎక్కించుకుని ఓ ఎనిమిదో తరగతి బాలుడు ఏపీ సీఎం చంద్రబాబు ముందు నిలిచాడు. వారిద్దరి స్నేహం చూసి ఏపీ సీఎం చంద్రబాబు మురిసిపోయారు. ఏంట్రా గుర్రమా.. అంటూ అడిగారు. శారీరక ఎదుగుదల లేని తన స్నేహితుడ్ని భుజాలపై ఎక్కించుకొని తన వద్ద చూపించటానికి తీసుకుని వచ్చిన పిల్లవాడిని చూసి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఏంట్రా గుర్రమా అని అడిగారు. అవునని ఆ బాలుడు చెప్పాడు. పక్కనుండే మహిళ భుజంపై వున్న బాలుడు శారీరకంగా ఎదగలేదని చెప్పడంతో.. తెలుసు.. చూస్తుంటే అర్థం అవుతుందని బాబు చెప్పారు. వారిద్దరిని దగ్గరకి తీసుకుని ఫోటోకు ఫోజిచ్చారు సీఎం చంద్రబాబు. అంతేగాకుండా "నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది" అంటూ చంద్రబాబు కొనియాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.