స్వస్థతపరుస్తానంటూ బాలికపై పాస్టర్ రేప్.. బయట చెపితే నరకానికి పోతావంటూ...

చర్చికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నేర్పిస్తానని చెప్పి బాలికపై పాస్టర్ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత ఆర్నెల్లుగా కొనసాగిస్తూ వచ్చాడు. పైగా, ఈ విషయం బయట ఎవరికైనా చెబితే నువ్వు నాశనమై నరకానిక

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:03 IST)
చర్చికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నేర్పిస్తానని చెప్పి బాలికపై పాస్టర్ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత ఆర్నెల్లుగా కొనసాగిస్తూ వచ్చాడు. పైగా, ఈ విషయం బయట ఎవరికైనా చెబితే నువ్వు నాశనమై నరకానికి పోతావంటూ బెదిరించాడు. దీంతో ఆ బాలిక కొద్ది రోజుల పాటు నోరు మెదపలేదు. కానీ, ఆ బాలిక శరీరంలో వచ్చిన మార్పులను గమనించిన తల్లిదండ్రులు... బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
 
కాకినాడ నగరంలోని పర్లోవపేటకు చెందిన 54 ఏళ్ల పాస్టర్‌ తాతపూడి జాషువా నిహార్‌ హౌస్‌ ఆఫ్‌ సాల్వేషన్‌ పేరుతో చర్చి నడుపుతున్నాడు. ఈయన గత ఆరు నెలలుగా 15 యేళ్ల బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. చర్చికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నేర్పిస్తానని ప్రతి రోజూ చర్చికి తీసుకెళ్లి అత్యాచారం చేస్తూ వచ్చాడు. పైగా, ఇక్కడ జరుగుతున్న విషయాన్ని నువ్వు ఎవరికైనా చెబితే నరకానికి పోతావ్‌ అంటూ ఆమెకు నిత్యం నరకం చూపించాడు. 
 
అంతేకాకుండా, బాలిక అనారోగ్యంతో బాధపడుతుందనీ ఆమెను తన వద్ద ఉంచితే స్వస్థతపరుస్తానంటూ బాలిక తల్లిదండ్రులను నమ్మించాడు. అలా ఆ కామ పాస్టర్‌ ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆ పాస్టర్‌ వికృత చేష్టలకు విసుగు చెందిన ఆ బాలిక ఎట్టకేలకు తల్లిదండ్రులకు చెప్పడం.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయాయి.
 
దీంతో పోలీసులు పాస్టర్‌ తాతపూడి జాషువా నిహార్‌పై పోక్సో యాక్ట్, కిడ్నాప్, రేప్‌ కేసులు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న జాషువా నిహార్‌ను అతనికి సహకరిస్తున్న ఓ మహిళను కూడా టూటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ రవివర్మ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments