Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఇల్లు నా పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యింది.. దివ్వెల మాధురి

సెల్వి
సోమవారం, 9 సెప్టెంబరు 2024 (11:50 IST)
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కొత్త ఇంటిపై దివ్వెల మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ నిర్మిస్తున్న ఆ కొత్త ఇల్లు తన పేరిట రిజిస్ట్రేషన్ అయిందని వెల్లడించారు. దువ్వాడకు గతంలో తాను రూ.2 కోట్లు ఇచ్చానని, ఆ తర్వాత మరోసారి రూ.50 లక్షలు ఇచ్చానని వివరించారు. 
 
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొంతకాలంగా భార్య వాణి, ఇద్దరు కుమార్తెలకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. అందుకు బదులుగానే దువ్వాడ శ్రీనివాస్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. 
 
అందువల్ల తన అనుమతి లేకుండా ఆ ఇంట్లోకి రావడానికి ఎవరికీ అనుమతి లేదని మాధురి స్పష్టం చేశారు. కాగా, దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని తన క్యాంపు కార్యాలయం అని చెబుతుండడంపైనా మాధురి స్పందించారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటే ఆ ఇంటిని దువ్వాడకు అద్దెకు ఇస్తానని వెల్లడించారు. 
 
అటు, దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆ ఇంటిపై స్పష్టత ఇచ్చారు. దివ్వెల మాధురి నుంచి తాను రెండున్నర కోట్లు తీసుకున్నది నిజమేనని చెప్పారు. తిరిగి ఇచ్చేందుకు తన వద్ద ఏమీ లేదని, చేసేది లేక ఆ ఇంటిని ఆమె పేరిట రాసేశానని తెలిపారు. దీంతో ఆ ఇల్లు దివ్వెల మాధురిదేనని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments