Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ తప్పతాగి భార్యాపిల్లల్ని వేధించాడు.. చుక్కేసి దురుసుగా ప్రవర్తించాడు.. అంతే చంపేశారు!

రోజూ తప్ప తాగి భార్యాపిల్లల్ని వేధించాడు. చుక్కేసి ఇష్టానికి మాట్లాడేవాడు.. భార్యాపిల్లలపై చేజేసుకునేవాడు. సంవత్సరాల పాటు తాగుబోతు భర్తను, తండ్రిని వారు భరించారు. కానీ వారి సహనం కోల్పోయింది. దీంతో తాగ

Webdunia
గురువారం, 28 జులై 2016 (09:08 IST)
రోజూ తప్ప తాగి భార్యాపిల్లల్ని వేధించాడు. చుక్కేసి ఇష్టానికి మాట్లాడేవాడు.. భార్యాపిల్లలపై చేజేసుకునేవాడు. సంవత్సరాల పాటు తాగుబోతు భర్తను, తండ్రిని వారు భరించారు. కానీ వారి సహనం కోల్పోయింది. దీంతో తాగుబోతును చంపేశారు. ఈ ఘటన ముప్పాళ్లలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ముప్పాళ్ల మండలంలోని ఇరుకు పాలెం గ్రామానికి చెందిన మరియ దాసును భార్యా, అతని పిల్లలే హత్య చేశారని సత్తెనపల్లి రూరల్‌ సీఐ కోటేశ్వరరావు పోలీసులు తెలిపారు. 
 
జూలై ఐదో తేదీన మరియదాసును తన నివాసంలోనే భార్య ఝాన్సీరాణి, కుమారులు ధనరాజు, విజయ్‌లు పచ్చడి బండతో తలపై కొట్టి హత్య చేశారని, అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సత్తెన పల్లి రైలు పట్టాలపై పడేశారని పోలీసులు వెల్లడించారు. అనుమానం మేరకు కుటుంబ సభ్యులపై విచారణ జరపడంతో హతుడు మరియ దాసు అతిగా మద్యం తాగి తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ప్రతి రోజూ వేధింపులకు గురిచేసేవాడని, ఆ వేధింపులకు తట్టుకోలేక హత్యచేసినట్లు భార్య ఝాన్సీరాణి అంగీకరించిందని సీఐ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments