Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోగీలను వదిలేసి ఇంజన్ తో వెళ్లిపోయిన డ్రైవర్

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:18 IST)
తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం తప్పింది. విశాఖ వెళ్లాల్సిన ట్రైన్లు తుని రైల్వే స్టేషన్ వద్ద క్రాసింగ్ కావాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ భోగీలను వదిలేసి ముందుకు వెళ్లిపోయాడు. సుమారు పది కిలోమీటర్ల మేర డ్రైవర్ ఇంజన్ తో వెళ్లిపోయాడు. 
 
భోగీలను వదిలేసి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. భయంతో కేకలు వేశారు. మధ్యలో నిలిచిపోవడంతో ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందోనని తెలియక టెన్షన్ పడ్డారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. 
 
దాంతో భోగీలు వదిలి వెళ్లిపోయిన డ్రైవర్ వెనక్కి వచ్చాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇంజన్ రాకపోవడంతో తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందారు ప్రయాణికులు. డ్రైవర్ వచ్చి భోగీలకు ఇంజిన్ అమర్చి యదావిధిగా తీసుకెళ్లాడు.

అయితే ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా హమ్మయా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments