Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం... లక్ష రూపాయలకు అమ్మేశాడు.. ఆ తరువాత?

కట్టుకున్న భర్తే తాగుడుకు బానిసై భార్యను అమ్మేశాడు. అది కూడా వ్యభిచార గృహానికి.. రెండు నెలల పాటు చిత్ర హింసలు అనుభవించిన ఆ మహిళ చివరకు ఎలాగోలా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (18:19 IST)
కట్టుకున్న భర్తే తాగుడుకు బానిసై భార్యను అమ్మేశాడు. అది కూడా వ్యభిచార గృహానికి.. రెండు నెలల పాటు చిత్ర హింసలు అనుభవించిన ఆ మహిళ చివరకు ఎలాగోలా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
ఎమ్మిగనూరు పట్టణంలోని గాంధీ వీధికి చెందిన రాజేష్‌ అనే వ్యక్తికి సంవత్సరం క్రితం అదే ప్రాంతానికి చెందిన సుజాతతో వివాహమైంది. ఆరు నెలల వరకు వీరి సంసారం బాగానే సాగింది. ఇంట్లో తన తండ్రి పెన్షన్ డబ్బుపై ఆధారపడి జీవించే వారు రాజేష్ కుటుంబం. ఉద్యోగం లేకపోవడంతో బాధతో తాగుడుకు బానిసైన రాజేష్‌ రోజూ తాగొచ్చి చిత్ర హింసలు పెట్టేవాడు. భర్త తాగుడు కోసం సుజాత ఇళ్ళల్లో పాచి పని చేస్తూ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది. 
 
అయితే భార్యపై అనుమానం పెట్టుకున్న భర్త రెండు నెలల క్రితం పూటుగా మద్యం తాగొచ్చి బయటకు వెళదామని సుజాతను స్కూటర్ పైన ఎక్కించుకుని వ్యభిచార గృహానికి తీసుకెళ్లి లక్ష రూపాయలకు అమ్మేశాడు. దీంతో సుజాత రెండు నెలల పాటు వ్యభిచార గృహంలో నరక యాతన అనుభవించి నిన్న మధ్యాహ్నం తప్పించుకుని బయటకు వచ్చి ఎమ్మిగనూరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి పలువురు మహిళలను విడిపించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments