ఏపీ ఎంసెట్‌ పరీక్షలు.. జూలై 27నుంచి జరుగుతాయా?

Webdunia
శనివారం, 11 జులై 2020 (11:06 IST)
ఏపీ ఎంసెట్‌ జూలై 27నుంచి 31వరకు జరుగనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్‌) వాయిదా పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షల తేదీలను ఉన్నతవిద్యా మండలి ఖరారు చేసింది. జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
జూలై 24న ఈసెట్‌ పరీక్ష జరపనున్నారు. జూలై 25న ఐసెట్‌ ఎంట్రన్స్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అయితే ప్రస్తుత పరీక్షల్లో ఎంసెట్ పరీక్షలు జరపడం అనుమానమేనని తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 1,79,774, అగ్రికల్చర్ మెడిసిన్ విభాగంలో 84,479 మంది, రెండు విభాగాలకు 604 మంది ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments