మేఘాలపైన ఉండే గ్రామం గురించి తెలుసా?

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:01 IST)
యెమెన్ ఓ అరబ్ దేశం. ఈ దేశానికి రాజధాని సనా. ఈ రాజధాని పరిధిలో అల్ హుతైబ్ అనే సుందరమైన గ్రామం ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే... ఇది భూ ఉపరితలం నుంచి 3,200 మీటర్ల ఎత్తులో ఓ కొండపై కొలువై ఉంది.

ఈ గ్రామంలో అల్ బోహ్రా, అల్ ముఖర్మ తెగలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. అసలు విషయానికొస్తే... ఈ ఊర్లో ఇప్పటివరకు వర్షం పడలేదు. ఈ ఊరు మేఘాల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడమే అందుకు కారణం.

అల్ హుతైబ్ లో ఎండ, చలి మాత్రం తీవ్రస్థాయిలో ఉంటాయి. ఎంతో ఎత్తయిన కొండపై ఈ ఊరు ఉండడం వల్ల మేఘాలన్నీ ఈ ఊరు కిందిగా వెళుతుంటాయి. మేఘాలు కొండ కింది భాగంలో వర్షించేటప్పుడు ఈ ఊరి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది.

దాంతో ఈ గ్రామం ఓ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి అల్ హుతైబ్ గ్రామాన్ని చూడడానికి పర్యాటకులు వస్తుంటారు. ఎత్తయిన ఈ కొండపై నిల్చుని, దిగువన ఉన్న మేఘాల నుంచి భూమ్మీదకు జాలువారే వర్షపాతాన్ని చూడడం ఓ మధురానుభూతిగా భావిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments