జనసేన పార్టీలోకి వలసలు.. క్యూ కడుతున్న వైకాపా నేతలు

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (10:15 IST)
సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలోకి రోజురోజుకూ వలసలు పెరుగుతున్నాయి. వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ముఖ్యంగా, అధికార వైకాపా నేతలు పోటీపడుతున్నారు. దీంతో జనసేన పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త, దివంగత డీకే ఆదికేశవులునాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీలో చేరారు. ఆమెకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
 
చైతన్య ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన కార్యక్రమాలను జనసేన ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నారు. జనసేన పార్టీలోకి వచ్చిన సందర్భంగా చైతన్యకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ప్రజా సంక్షేమమే పరమావధిగా తాత ఆదికేశవులునాయుడు బాటలో నడవాలని ఆమెకు సూచించారు. ఆదికేశవులునాయుడు సమాజ అభివృద్ధి కోసం ఎంతగానో తపించారని, టీటీడీ బోర్డు చైర్మన్ గా ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిని చైతన్య కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments