Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర వ్యాప్తంగా 61.28 లక్షల మందికి పెన్షన్ పంపిణీ

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (18:59 IST)
వైయస్ఆర్‌ పెన్షన్‌ కానుక కింద లబ్ధిదారులకు శనివారం ఉదయం నుంచే వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 2.68 లక్షల మంది వలంటీర్లు పెన్షనర్ల ఇంటికి వద్దకు వెళ్ళి, లబ్ధిదారుల చేతికే ఫించన్ సొమ్మును అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మొదటి రెండు గంటల్లోనూ దాదాపు యాబై శాతంకు పైగా ఫించన్ల పంపిణీ పూర్తయ్యింది. సాయంత్రం అయిదు గంటల వరకు 95.44 శాతం మందికి పెన్షన్ల అందచేతను పూర్తి చేశారు. మొత్తం 61.28 లక్షల మంది పెన్షనర్లకు గానూ 58.49 లక్షల మందికి ఫింఛన్ సొమ్ము అందింది.

జూలై నెలకు సంబంధించి, ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1478 కోట్లు విడుదల చేయగా, తొలి రోజు సాయంత్రం అయిదు గంటల వరకు రూ.1398 కోట్లు పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 

శనివారం సాయంత్రం అయిదు గంటల వరకు అత్యధికంగా విజయనగరంజిల్లాలో 96.71శాతం, చిత్తూరుజిల్లాలో 96.70శాతం, వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో 96.33 శాతం, శ్రీకాకుళంలో 96.14 శాతం, కృష్ణాజిల్లాలో 95.92 శాతం, నెల్లూరు జిల్లాలో 95.80 శాతం, పశ్చిమ గోదావరిజిల్లాలో 95.51 శాతం, తూర్పుగోదావరిజిల్లాలో 94.77శాతం, కర్నూలు జిల్లాలో 94.63 శాతం, గుంటూరు జిల్లాలో 94.51 శాతం, అనంతపురం జిల్లాలో 94.41 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది.

ఎఆర్టీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ పెషంట్లుగా వున్న వారికి నూరుశాతం పెన్షన్ పంపిణీ జరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ పెషంట్లుగా వున్న వారికి 83.28 శాతం, డిఎంఅండ్‌హెచ్‌ఓ పరిధిలోని హెల్త్ పెన్షనర్లకు 95.44 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments