Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ నిందితుల ఎన్ కౌంటర్: హ్యాట్సాఫ్ కేసీఆర్ అంటూ ఏపీ సీఎం జగన్-video

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (18:50 IST)
దిశ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై వచ్చిన పోలీసు తీర్పు ఎన్‌కౌంటర్. ఇది కూడా దేశంలో పెద్ద ఎత్తున ప్రచారానికి తెరదీసింది. నలుగురు మృగాళ్ళకు పడిన సరైన శిక్ష అంటూ యావత్ దేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంది. 
 
దిశ హత్యపై తెలంగాణా సిఎం సరిగ్గా స్పందించలేదంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్సలు చేశాయి. అయితే మౌనంగా ఉన్న కెసిఆర్ అన్నింటిని విన్నారు. పోలీసుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సరైన సమయానికి పోలీసులు స్పందించి ఉంటే దిశ బతికి ఉండేదన్న వాదన వినిపించింది. 
 
ఒకవైపు ప్రభుత్వానికి, మరోవైపు పోలీసులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటంతో కెసిఆర్ ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఎపి అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం జగన్ మాట్లాడుతూ... నేను ఇద్దరు ఆడపిల్లల తండ్రినే. నాకు ఒకే ఒక భార్య ఉంది. నాకు చెల్లెలు ఉంది. ఇద్దరు కుమార్తెలు నాకు ఉన్నారు. అందుకే చెబుతున్నా కెసిఆర్ హ్యాట్సాప్.. తెలంగాణా పోలీస్ హ్యాట్సాఫ్ మంచి తీర్పు వచ్చిందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments