Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JusticeForGeethanjali తెనాలి గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకున్నదా? సోషల్ మీడియాలో భిన్న వాదనలు

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (13:11 IST)
కర్టెసి-ట్విట్టర్
మార్చి 7వ తేదీనాడు తెనాలి రైల్వే లైన్ క్రాస్ చేస్తూ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో గీతాంజలి(#JusticeForGeethanjali) అనే 30 ఏళ్ల మహిళ తీవ్రగాయాలకు గురైంది. ఆ తర్వాత ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి రెండురోజుల చికిత్స చేసిన అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూసింది. ఆమె చనిపోవడానికి కారణం.. తెదేపా-జనసేన సోషల్ మీడియా ట్రోల్స్ కారణమంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఎందుకంటే... జగనన్న ఇల్లు తనకు వచ్చిందన్న సంతోషంతో ఆమె ఓ వీడియోలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కనబడింది.
 
అంతేకాదు... వచ్చే ఎన్నికల్లో జగనన్నకి ఓటు వేసి గెలిపిస్తామంటూ కూడా చెప్పింది. ఈ నేపధ్యంలో ఆమె 7వ తేదీన రైలు ప్రమాదానికి గురైంది. ఐతే ఇది ప్రమాదం కాదు... ఆత్మహత్య అంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం సాగిస్తోంది. మరోవర్గం ఇదంతా అవాస్తవమనీ, 7వ తేదీనాడు ప్రమాదం జరిగిన నాడే ఈ వార్తలు ఎందుకు రాయలేదని నిలదీస్తోంది.
 
కనీసం 8వ తేదీనాడైనా రాయాలి కదా అని ప్రశ్నిస్తోంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ మహిళ మరణానికి ఫలానా పార్టీలు ట్రోల్స్ కారణమంటూ ఎలా నిర్థారిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేస్తున్నారు. వాస్తవం ఏంటన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments