Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు కట్టుకుని దర్శన టిక్కెట్ల కోసం శ్రీవారి భక్తులు, ఎంత పెద్ద క్యూలైనో గోవిందా

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (18:25 IST)
ఎప్పుడు తిరుమల శ్రీవారి దర్సనం కోసం టోకెన్లను మంజూరు చేసినా భక్తులు మాత్రం వెనక్కి తగ్గరు. ఆ స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు ఎంతసేపయినా వేచి ఉంటారు. టోకెన్లను పొందుతారు. సరిగ్గా వారంరోజుల క్రితం నుంచి టోకెన్ల ప్రక్రియను టిటిడి నిలిపివేసింది.
 
ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి టోకెన్లను ఈ నెల 30వ తేదీ వరకు అందిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో టోకెన్లను పొందేందుకు భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుపతిలో టోకెన్లను కేటాయించే మూడు ప్రాంతాల్లోను భక్తుల రద్దీ అదే స్థాయిలో కనిపించింది.
 
ముఖ్యంగా అలిపిరికి దగ్గరలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు బారులు తీరారు. రెండు కిలోమీటర్లకు పైగా క్యూలైన్ కనిపించింది. శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. అయితే గతంలోలా గంటల తరబడి వేచి ఉన్నా టోకెన్లు లేక ఇబ్బంది పడి వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఈ సారి నాలుగు రోజులలో ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకునేందుకు టోకెన్లు ఇవ్వడంతో భక్తులు టోకెన్లతోనే తిరిగి వెళ్ళారు.
 
టోకెన్లు పొందిన స్థానికులు అయితే సరిపెట్టుకున్నారు గానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేదిలేక కొంతమంది భక్తులు మాత్రం వెనుతిరిగి వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments